Tdp Party | టీడీపీ నేత జగదీష్‌కు పరామర్శ

Tdp Party | టీడీపీ నేత జగదీష్‌కు పరామర్శ


Tdp Party | మోపిదేవి, ఆంధ్రప్రభ : బొబ్బర్లంక టీడీపీ సీనియర్ నాయకుడు దొప్పలపూడి జగదీష్ మాతృమూర్తి, సర్పంచ్ దొప్పలపూడి గంగా భవాని అత్తగారైన దొప్పలపూడి సరోజిని సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం బొబ్బర్లంకలోని వారి స్వగృహంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ (Committee Chairman) కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు నడకుదిటి జనార్దన్ రావు, రావి నాగేశ్వరరావు, కోనేరు నాగేశ్వరరావు, పర్చూరి దుర్గాప్రసాద్, కర్రా సుధాకర్, చందన రంగారావు, డోకిపర్తి బాల కోటేశ్వరరావు, భళ్ళ ప్రసాద్, బాల బుల్లి బాబు, కొమ్ము పవన్ కుమార్, గుంటూరు వినయ్ బాబు, మీసాల శివ రామప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply