బొబ్బర్లంకలో మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు

మోపిదేవి, ఆంధ్రప్రభ : బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తవుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం, తెలుగు జాతి గర్వకారణం, పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని కొనియాడారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానికులకు మరియు పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేయడంతో గ్రామ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ,టీడీపీ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply