ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ కారు హారియర్‌ను జూన్ 3న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ కారు టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఈ కొత్త ఈవీ కారు ఒక పర్వత శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపింది. టాటా హారియర్ ఈవీ స్పెసిఫికేషన్లను కంపెనీ విడుదల చేయలేదు.
ఈవీలో మెరుగైన ఇంటీరియల్ స్పేస్, అద్భుతమైన ఫీచర్లతో తీసుకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. డ్యూయల్ మోటార్, ఆల్‌వీల్ ట్రైవ్, మల్టి లింక్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్‌తో హారియర్ వస్తోంది.
మోడల్‌ను బట్టి కారు ధర 24 నుంచి 30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డి స్‌ప్లే, 10 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, వాయిస్ యాక్టివేటెడ్ పనోరమిక్ సన్‌రూప్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ ఆపరేటెడ్ టెయిల్‌గేట్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.