T Congress | అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్

T Congress | అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్
T Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం తరపున పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ (nomination) వేసిన అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) అన్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. హస్తం పార్టీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి (Vem Narender Reddy) నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు భారీ ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీ సిటింగ్ ఎంపీగా ఉన్నారు.
అలాగే రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలుండే నరేందర్ రెడ్డి పేరుపై ఎవరి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్ఠానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం దక్కింది.
