పొచమ్మ మీద ఒట్టు.. రామాలయం నిర్మిస్తా – పడిదెల నవీన్..

పొచమ్మ మీద ఒట్టు.. రామాలయం నిర్మిస్తా – పడిదెల నవీన్..

  • ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధిని చూపిస్తా?.
  • స్వంత నిధులతో అభివృద్ధిని చేస్తా..
  • కార్పొరేట్ స్థాయి పాఠశాల.. రామాలయ నిర్మాణం..
  • అధికార పార్టీ తోనే అభివృద్ధి.. అవకాశం ఇవ్వండి..
  • మున్సిపాలిటీ రెండో వార్డులో పరిధిలో పడిదెల నవీన్ ప్రచారం..

ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీలో ప్రచార హోరు జోరుగా సాగుతుంది. అభ్యర్థులు ఎవరు కూడా హామీల విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఇస్తున్నారు. విజయమే లక్ష్యంగా తమ ప్రచార పర్వాన్ని అభ్యర్థులు సాగిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క హామీతో ప్రజలను తమ తమ గుర్తుల పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలోని రెండో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంపల్లి వీణ విజేందర్రెడ్డి గెలుపు కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త కాంగ్రెస్ పార్టీ యువ నేత పడిదెల నవీన్ ప్రచారం చేస్తున్న తీరు పలువురుని ఆకట్టుకుంటుంది. వార్డు డెవలప్మెంట్ కోసం అన్ని విధాల అండగా ఉంటానని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతూ హస్తం గుర్తు పై ఓటు వేయాలని పడిదెల నవీన్ కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే సొంత డబ్బులతో రామాలయ నిర్మాణం చేస్తానని అందుకు పోచమ్మ మీద ఒట్టు అని ఆయన ప్రచారంలో తెలుపుతూ ఆ ఒక్కటే కాకుండా పిల్లల చదువు కోసం ఉన్న పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని అది నా వల్ల అవుతుంది అని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అంతే కాకుండా ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని అందుకు హస్తం గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంపెల్లి వీణ విజేందర్రెడ్డిలను గెలిపించాలని నవీన్ కోరుతున్నారు.

స్థానిక శాసనసభ్యులు మాధవరెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా ప్రయత్నించి ముత్తోజుపేట వార్డు అభివృద్ధిని భుజాల పై ఎత్తుకుంటానని ఒక్క అవకాశం ఇచ్చి అభ్యర్థిని గెలిపించాలని అందుకు హస్తం గుర్తు పై ఓటు వేయాలని ఆయన కోరుతున్నారు. ఆయన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply