Swearing Ceremony | ఢిల్లీ సిఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం …హాజరైన మోదీ, చంద్రబాబు, పవన్
న్యూ ఢిల్లీ – ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ముందుగా రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు.. 12 రాష్ట్రాల సీఎంలు, పలువురు డిప్యూటీ సీఎంల , ఎన్డీఎ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.