శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి…

శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి…

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని కొబ్బరి తోట జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటిని కూల్చిన ఘటనపై బాధితుడు తరపు న్యాయవాది చంద్రాల గోపికృష్ణ సోమవారం మచిలీపట్నంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. చట్టాలను.. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా అన్యాయంగా శ్రీపతి వెంకటాచలానికి చెందిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారన్నారు. జస్టిస్ గావాయ్, జస్టిస్ కె వి విశ్వనాథం నేతృత్వంలోని గౌరవ సుప్రీంకోర్టు అందించిన బుల్ డోజర్ జస్టిస్ తీర్పును అనుసరించి కొబ్బరి తోట ఇంటిని కూల్చివేత ఘటనలో బాధితుడు శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలన్నారు.

బందరు కార్పొరేషన్ కమిషనర్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీపతి వెంకటాచలానికి చెందిన ఇంటిని కూలదొయడం చట్ట, రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. కొబ్బరి తోటలోని 1.59 ఎకరాల వెంచర్ లో మనిషికో రకంగా అనుమతులు కల్పిస్తూ గౌరవ కోర్టులను సైతం అయోమయానికి గురి చేసేలా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారన్నారు. కొబ్బరి తోట వెంచర్ కు సంబంధించిన ఇంటి నిర్మాణాలలో కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో ఒకలా, గౌరవ హైకోర్టులో మరోలా నివేదికలు అందిస్తూ గౌరవ కోర్ట్ లను సైతం మున్సిపల్ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఓఎస్ నెంబర్ 409/2025 కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో శ్రీపతి వెంకటాచలానికి సంబంధించిన కేసులో ఒకలా ఓఎస్ నెంబర్ 3328/2024 గౌరవ హైకోర్టులో తోట నరేంద్రకు చెందిన కేసులో మరోలా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించడం కోర్టులను తప్పుదోవ పట్టించడమే అన్నారు. కొబ్బరి తోట వెంచర్ లో తమకు హక్కు ఉందంటూ కొండపల్లి వారు చేస్తున్న వాదనలలో వాస్తవం లేదన్నారన్నారు. చట్టాలపై గౌరవం లేకుండా మెప్పుల కోసం అధికారులు పొంతన లేని విధానాలను అవలంబిస్తే చిక్కుల్లో పడతారని వాస్తవాన్ని గుర్తించుకోవాలన్నారు.

Leave a Reply