Supreme Court | పునర్ నిర్మాణం సాధ్యం కాదు..

Supreme Court | పునర్ నిర్మాణం సాధ్యం కాదు..
- సీఎం యోగి ఆదిత్యనాద్ సంచలన వ్యాఖ్యలు
Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బాబ్రీ మసీదు పునర్ నిర్మాణం సాధ్యం కాదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బాబ్రీ పునర్ నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఎవరూ ఆ సాహసం చేయడానికి వీల్లేదని తెలిపారు.
అయితే.. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, కూల్చివేసిన బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలోని ధన్నిపూర్‌లో 5 ఎకరాల స్థలంలో కొత్త మసీదు నిర్మాణం (మస్జిద్-ఎ-అయోధ్య) ప్రతిపాదించబడింది. దీని నిర్మాణం సవరించిన ప్లాన్లతో ఏప్రిల్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అప్పటి అధికారులు అంచనా వేశారు. ఈ కాంప్లెక్స్‌లో మసీదుతో పాటు ఆసుపత్రి, లైబ్రరీ మరియు మ్యూజియం కూడా నిర్మించాలని నిర్ణయించారు.
