Sujana Chowdhury | ఎల్వోసీ పత్రం అందజేత..

Sujana Chowdhury | ఎల్వోసీ పత్రం అందజేత..
Sujana Chowdhury, భవానిపురం, ఆంధ్రప్రభ : ఆసుపత్రి వైద్యం నిమిత్తం అవసరమైన ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అందజేశారు. భవానిపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక చిన్నారి తండ్రి భాస్కర్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు.
ఈ నేపథ్యంలో చిన్నారి వైద్య ఖర్చులకు అవసరమైన రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి లేఖ రాశారు. అనంతరం రోగికి సంబంధించిన ఎల్వోసీ పత్రాన్ని భవానిపురంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ భాస్కర్, తమ కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి, అలాగే సహకారం అందించిన కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
