Students | రేకుల షెడ్డుల్లో ప్రైవేట్ స్కూళ్లు?

Students | రేకుల షెడ్డుల్లో ప్రైవేట్ స్కూళ్లు?

  • వ్యాపార దృక్పథంగా మారిన విద్య‌
  • వ‌స‌తులు క‌ల్పించ‌డంలో యాజ‌మాన్యం విఫ‌లం
  • ఆర్భాటం తప్ప నాణ్యత పై పట్టింపు లేదు
  • సౌక‌ర్యాలు లేక విద్యార్థుల ఇబ్బందులు
  • ధ్వంసమైన రేకుల షెడ్లలో తరగతుల నిర్వహణ

Students | ఏలూరు ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : విద్య ఎంతో పవిత్రమైనది. దానిని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్ప‌టి మాట. అది పక్కా వ్యాపారంగా కొంతమంది ప్రవేట్ స్కూల్స్ యాజమాన్యం వ్యవహరిస్తున్నారు. ఏలూరు రూరల్ (Eluru Rural) ప్రాంతం చాటపారు గ్రామంలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ అనే ఒక ప్రైవేటు పాఠశాల కనీస వసతులు కూడా లేకుండా ధ్వంసమైన రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

Students

విద్యార్థుల (Students) తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు దోపిడీ చేస్తూ పాఠశాలలో కనీస సదుపాయాలు కూడా లేకుండా ఒక పాడుబ‌డిన భవనాలలో విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ యాజమాన్యం కాలం వెళ్ల‌దీస్తున్నారు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుండి అనేక అనుమతులు తీసుకోవలసి ఉండగా, నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యాశాఖ అధికారులకు మామూళ్లు ఇస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆడిందే ఆట‌గా.. పాడిందే పాటగా చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి పాత పడిపోయిన భవనాలలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply