ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం..

ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాస్యపు సురేష్ బాబు ఆధ్వర్యంలో 2025- 26 విద్యార్థుల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల ప్రేమ, గురువుల ఆశీస్సులు కీలకమని, విద్యార్థులు ఉన్నత లక్ష్య సాధనకు ఓర్పు, నేర్పుతో శ్రమించాలని సూచించారు. కనిపించే దేవుళ్లే తల్లిదండ్రులు, గురువులు అని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ వెంకటరావుపల్లి ఇంచార్జ్ హెచ్ఎం ఉప్పుల రవీందర్ ఉపాధ్యాయ బృందం ఎంపీపీ ఎస్ జోడిపల్లి హెచ్ఎం గంధం శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ పెరుమండ్ల చంద్రకళ మొగిలి, ఏ ఏ పీసీ చైర్ పర్సన్ మంజుల రవి, నేరెళ్ల ఓం నారాయణ, అనవేన కుమార్, ఉపాధ్యాయ బృందం పిల్లలు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply