పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు
జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పార్లమెంట్ లో ఆమోదం పొంది చట్టంగా రూపాంతరం చెందిన సందర్భంగా గురువారం మండలంలోని చిన్న ముష్టూర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లోని విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కేకును కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశ్రీఫ్ అలీ, కళాశాల హెడ్ ఆఫ్ సెక్షన్స్ డాక్టర్ సులోచన, నిత్య లావణ్య , లెక్చరర్స్, బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.
