రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక

దండేపల్లి, అక్టోబర్ 16(ఆంధ్రప్రభ): హైదరాబాద్‌లో ఈ నెల 17,18వ తేదీల్లో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు దండేపల్లి మండలం కన్నెపల్లి గ‌ల మదర్ థెరిసా పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థిని జి. మాన్యజ ఎంపికైంద‌ని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అనూప్ జార్జ్, మేనేజర్ షైన్, కరస్పాండెంట్ లింటో, పీఈటీలు సుద్దాల దీపిక, గారె పవన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థిని మాన్య‌జ‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Leave a Reply