కథల పుస్తకాలు ఆవిష్కరణ…

దండేపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవన్నీ పురస్కరించుకుని,దండేపల్లి మండలం లోని గుడిరేవు జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు రాసిన కథల పుస్తకాలను పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బండారి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ భాషను మర్చిపోతే మన మూలాలను మరిచినట్లేనని అన్నారు, ప్రతి ఒక్కరు మన మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివే ఉన్నత శిఖరాలను అధిరోహింస్తారని అన్నారు. తెలుగు భాషను చక్కగా మాట్లాడ కలిగితే ఇంకా ఎన్నో రకాల పుస్తకాలు రాయవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.తెలుగు పదాలు సేకరించి కథలు చెబుతాను వింటారా అనే శీర్షిక తయారు చేసి కథలను రాసిన విద్యార్థులను అభినందించారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో,పాఠశాల ఉపాధ్యాయులు కర్నె నరేందర్, బి రాజశేఖర్, ఎం అనిత, సల్మా, పి.లచ్చన్న ఏ ఖండు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply