Statue | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

Statue | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
Statue | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విగ్రహావిష్కరణ(Statue unveiling) సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మ, బోనాలు తీసుకుని వచ్చారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్అండ్బీ ఈఈ(R&B EE). తెలంగాణ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరిస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల కోడ్(election code) నేపథ్యంలో కలెక్టర్ కు బదులుగా ఆర్అండ్బీ ఈఈ మోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
