అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆఫీసులు నిర్మించాలి…

అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆఫీసులు నిర్మించాలి…
మండల పరిషత్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, ఆంధ్రప్రభ : ఆమదాలవలస పట్టణంలో ఉన్న మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 32 లక్షలు రూపాయలతో ఆధునికీకరించారు. ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మంగళవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ కార్యాలయాలను సదుపాయాలతో అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మండల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆధునిక వసతులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శారదమ్మ , జడ్పీటీసీ బెండు గోవింద రావు గారు, ఎంపిడిఓ , స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
