ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ పరీక్షలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్, కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రిఫరీ బోర్డు ఆధ్వర్యంలో, జిల్లా కబడ్డీ సంఘం సహకారంతో ఆదివారం నగరంలోని విజ్ఞాన్ హై స్కూల్‌లో రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లలో రిఫరీలుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పిస్తామని తెలంగాణ రిఫరీ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు మరియు రిఫరీ బోర్డు కన్వీనర్ అనిల్ కుమార్, అంతర్జాతీయ స్థాయి ప్రో కబడ్డీ ఎంపైర్ శ్రీనివాస్, జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు మరియు పరీక్ష పరిశీలకుడు ఆంధ్యాల లింగయ్య, కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి సురేందర్, సాయగౌడ్, మీసాల ప్రశాంత్, సునీల్, వీరస్వామి, అనురాధ, కవిత, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply