మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పగిడిమరి సర్పంచ్ జాఫర్, ఓ ఎమ్ ఐ ఎఫ్ జిల్లాకోఆర్డినేటర్ హాజమ్మ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమారిలో ఓ యం ఐ ఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనిఅన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న వివిధ స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. కుట్టు మిషన్ కేంద్రం సద్వినియోగం చేసుకొని స్వశక్తితో ఆర్థిక స్వలంబనసాధించాలన్నారు. మహిళాభివృద్ధికోసం ఓఎంఐఎఫ్ స్వచ్ఛంద సంస్థ స్వయం ఉపాధి కోసం ఎన్నో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిందని కుట్టు మిషన్ నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగేష్, పంచాయతీ కార్యదర్శి ఆసిఫా, తదితరులు పాల్గొన్నారు.
