SRH vs LSG | నిజాంలకు షాకిచ్చిన నవాబుల జట్టు…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు ఎస్‌ఆర్‌‌హెచ్‌పై సూపర్ విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. దీంతో హాట్ ఫేవరెట్‌గా మ్యాచ్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాకిచ్చిన ఎల్ఎస్‌జీ.. 5 వికెట్ల తేడాతో గెలిచింది.

దీంతో ఈ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసిన లక్నో… పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ ఫలితంలో 6వ స్థానానికి పడిపోయింది.

కాగా, ఈమ్యాచ్ లో 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నవాబులు.. దంచి కొట్టారు. టాపార్డర్ బ్యాటర్లలో నికోలస్ సూరన్ (26 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సుతో 70), మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులతో 52) అర్ధశతకాలతో చెలరేగారు. ఇక ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (7బంతుల్లో 2ఫోర్లు 13 నాటౌట్), అబ్దుల్ సమద్ (8 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులతో 22) అద్బుతంగా రాణించారు. దీంతో లక్నో సూపర్ జేయింట్స్ ఎస్‌ఆర్‌‌హెచ్ పై సూపర్ విక్టరీ సాధించింది. ఎస్ఆర్‌‌హెచ్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ రెండు వికెట్లు తీయగా.. షమీ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, ఈసారి కూడా ఆరెంజ్ ఆర్మీ సొంత మైదానంలో 200 కంటే ఎక్కువ పరుగులు సులభంగా సాధిస్తుందని అందరూ భావించారు.

కానీ, లక్నో బౌలర్లు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కు షాక్ ఇచ్చారు. కీలక బ్యాటర్లను ప్రారంభంలోనే పెవిలియన్‌కు పంపి.. ఎస్‌ఆర్‌‌హెచ్‌కు గట్టి దెబ్బ కొట్టారు. హైదరాబాద్ విద్వంసక బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (47) రాణించగా.. అభిషేక్ శర్మ (6), ఇషాన్ కిషన్ (0) ఆదిలోనే ఔటయ్యారు. ఇక నితిష్​ కుమార్ రెడ్డి (32), క్లాసెన్ (26), అంతకా ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఆఖర్లో అనికేత్ వర్మ (36), కెప్టెన్ కమ్మిన్స్ (18) సిక్సులతో చెలరేగారు. దాంతో హైదరాబాద్ స్కోర్ 190కి చేరింది.

ఇక లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్) నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక ఆవేశ్ ఖాన్, దగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *