మునుగోడులో మార్చి 31న ప్రత్యేక వైద్య శిబిరం

మునుగోడు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ 99 డేస్ హెల్త్ ప్రోగ్రాం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు (మార్చి 31) ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి ఏకె మాధురి తెలిపారు.
ఈ శిబిరానికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్లగొండ నుండి ప్రసూతి, స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్, దంత వైద్య నిపుణులు పాల్గొని సేవలు అందించనున్నారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని ఆమె తెలిపారు.ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిపుణుల వైద్య సేవలు పొందాలని కోరారు. శిబిరాన్ని విజయవంతం చేయడానికి ప్రజల సహకారం అవసరమని వైద్యాధికారి మాధురి విజ్ఞప్తి చేశారు.
