వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..

  • తొర్రూరు చైర్మన్ శ్రావణ్ కుమార్ పర్యటన

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం చైర్మన్ శ్రావణ్ కుమార్ వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యటనలు నిర్వహిస్తున్నారు.

శనివారం ఉదయం 7 గంటలకు 5వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి దబ్బా తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంచి నీటి సరఫరా, విద్యుత్ వీధి దీపాలు, పారిశుద్ధ్య పనుల పరిస్థితిపై వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో నిర్వహించాలని, అలాగే వీధి దీపాలు ఎప్పటికప్పుడు వెలిగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా ఈ సేవలు సమర్థవంతంగా అమలు కావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, 5వ వార్డు కౌన్సిలర్ బాపు రెడ్డి, వార్డు అధికారులు ఉమేష్, మీనేశ్వర్, ఇంచార్జ్ ఎస్‌ఐ రవీందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply