సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

  • అచ్చంపేట డిపో మేనేజర్ పిఎండి ప్రసాద్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుటకు మహబూబ్నగర్ రీజియన్ ప్రాంతీయ అధికారి చర్యలు చేపట్టినట్టు మంగళవారం అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎండి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, అచ్చంపేట డిపో మరియు నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డిపో వారీగా బస్సుల వివరాలు:
ఏప్రిల్ 1: అచ్చంపేట – 8, నాగర్ కర్నూల్ – 20
ఏల్ 2: అచ్చంపేట – 12, నాగర్ కర్నూల్ – 25
ఏప్రిల్ 3: అచ్చంపేట – 12, నాగర్ కర్నూల్ – 22

భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. టికెట్ ధరలు అచ్చంపేట డిపో నుంచి రూ.160 కాగా, నాగర్ కర్నూల్ డిపో నుంచి రూ.220గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని వినియోగించుకొని సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.

Leave a Reply