88. పదం తే కీర్తీనాంప్రపదమపదం దేవి విపదాం
కథంనీతంసద్భిః కఠిన కమఠీకర్పరతులాం
కథం వా పాణిభ్యాముపయమనకాలేపురభిదా
యదాదాయన్యస్తందృషదిదయమానేన మనసా.
తాత్పర్యం: దేవీ! పార్వతీ! అన్ని విధాలైన కీర్తులకు నిలయము, ఆపదలకు స్థానం కానిది అయిన నీ పాదాల పైభాగాన్ని సత్కవులు గట్టిగా ఉండే ఆడు తాబేలు వీపు పై ఉండే డిప్పతో పోల్చే ప్రయత్నం ఎట్లా చేస్తారు? త్రిపురాసుర సంహారం చేసిన శివుడు వివాహ సమయంలో నిర్దయుడై తన చేతులతో నీ మెత్తని పాదాన్ని సన్నికల్లుపైఎట్లా ఉంచగలిగాడు?
- డాక్టర్ అనంతలక్ష్మి