SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది …. సహాయ కార్యక్రమాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు…
ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల్లో అపశ్రుతి
మూడు మీటర్ల మేరకు కుంగిన టన్నెల్
ఆ మేర కుప్పకూలిన పైకప్పు
ప్రమాదంలో13 తీవ్ర గాయాలు
సొరంగంలో చిక్కుకున్న మరో ఎనిమంది కార్మికులు
ప్రమాద సమయంలో లోపల 50 మంది
42మంది సురక్షితంగా బయటకు
సహాయకకార్యక్రమాలకు ఎన్డీఆర్ఎఫ్ కు పిలుపు
కొనసాగుతున్న సహాయక చర్యలు
స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్
సహాయక చర్యల్లో స్పీడ్ పెంచాలని ఆదేశం
ఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు జరుగుతున్న ఈ సొరంగం మార్గంలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు అక్కడ ఎనిమిది మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు.. మరో మంత్రి జూపల్లితో కలసి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న ఆయన ప్రమాద వివరాలను వివరించారు..
10 రోజుల క్రితం అమర్చిన టన్నెల్ రింగ్స్ నుంచి నీరు రావడంతో ప్రమాదం సంభివించిందన్నారు.. ఇసుక కరిగి పని జరుగుతున్న రింగ్ పైన మూడు మీటర్ల మేర మట్టి పెళ్లలు విరిగిపడ్దాయన్నారు. ఆ సమయంలో అక్కడ విధులలో ఉన్న ఎనిమిది మంది అక్కడే చిక్కుకుపోయారని తెలిపారు..
ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్ లో మొత్తం 50 మంది విధులలో ఉండగా, వారిలో సగం మందికి పైగా బయటకు వచ్చేయగా, మరో 17 మందిని ఫైర్ సిబ్బంది, పోలీస్ లు బయటకు తీసుకొచ్చారని చెప్పారు.. ప్రమాదం 14 కిలో మీటర్ల లోపల జరగడంతో అక్కడకు సహాయ బృందాలు వెళ్లడం కష్ట సాధ్యంగా మారిందని ఉత్తమ్ చెప్పారు..
ప్రధానంగా మట్టి పెళ్లలు రిగ్ పై పడటంతో అది కదలి అవకాశం లేకపోయిందన్నారు. దీనితో సహాయ కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కోసం కేంద్రాన్ని అభ్యర్ధించామన్నారు.. ఇదే సమయంలో స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తక్షణం సహాయ కార్యక్రమాల కోసం సంఘటనా స్థలానికి వెళ్లవలసిందిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.. దీంతో మూడు బృందాలు అక్కడికి బయలుదేరాయి . విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం అక్కడికి మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకోవచ్చని మంత్రి చెప్పారు. .. ఈ రాత్రికి లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు
ప్రమాద సమయంలో టన్నెల్‌లో 50 మంది..

టన్నెల్ ప్రమాద సమయంలో 50 మందికి పైగా కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై బయటకు పరిగెత్తారు. ఇప్పటి దాకా 42మంది కార్మికులను టన్నెల్ నుంచి సురక్షింతంగా బయటకు తీసుకొచ్చారు.. ఇక.. సొరంగంలో ఎనిమిది రు కార్మికులు చిక్కుకున్నారు. వారిని తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ టన్నెల్ పనులను జేపీ కాంట్రాక్టర్ సంస్థ నిర్వహిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. గుర్జిత్ సింగ్ (పంజాబ్), సన్నీత్ సింగ్ (జమ్మూ కశ్మీర్), శ్రీనివాసులు (యూపీ), మనోజ్ రూబెన్ (యూపీ), సందీప్ (జార్ఖండ్), సంతోష్ (జార్ఖండ్), జట్కా హిరాన్ (జార్ఖండ్). అంజూ సాహు(జార్ఖండ్)
సంఘటనా స్థలానికి మంత్రుల రాక..
ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చారు. నాగర్ కర్నూలులో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు.. నాగర్ కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
సహాయ కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తున్న సిఎం రేవంత్ ….
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చి వారికి అత్యవసరవైద్యం అందించాని కోరారు.. అవసరమైతే గాయపడిన కార్మికులను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.. కాగా, అక్కడి పరిస్థితిని రేవంత్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ ఉంచి సమీక్షిస్తున్నారు..