Jack | ఇంట్రెస్టింగ్ గా సిద్ధూ కొత్త‌ సినిమా టీజర్..

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. సిద్ధూ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేక‌ర్స్.

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *