స్టూడెంట్‌గా మారిన ఎస్ఐ.. ఆకతాయిలకు చెక్

టేకుమట్ల, ఆంధ్రప్రభ : పోలీసు అంటే కేవలం లాఠీ పట్టి విధులు నిర్వహించడం మాత్రమే కాదు… అవసరమైతే విద్యార్థిగా మారి కూడా నేరాలను అరికట్టగలరని భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో జరిగిన ఘటన మరోసారి నిరూపించింది.
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు ఎస్ఐ అమూల్య స్టూడెంట్ గెటప్‌లో రంగంలోకి దిగారు. పరీక్ష ప్యాడ్ చేతిలో పట్టుకుని సాధారణ విద్యార్థిలా పరీక్షా కేంద్రం వద్ద తిరుగుతూ ఆకతాయిల కదలికలను గమనించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అమూల్య మాట్లాడుతూ అమ్మాయిలను వేధించడం, టీజింగ్ చేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు కటకటాల పాలవుతారని స్పష్టం చేశారు.
మహిళల పట్ల గౌరవభావంతో ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె తెలిపారు. ఆకతాయిలకు చెక్ పెట్టేందుకే తాను ఈ వేషంలో వచ్చానని చెప్పారు.
