SI Chanakya | చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధం..

SI Chanakya | చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిషేధం..
SI Chanakya | కోడూరు, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడూరు మండల పరిధిలో కోడి పందాలు, గుండాట, పేకాట వంటి అక్రమ జూద కార్యకలాపాలు నిర్వహించరాదని కోడూరు ఎస్‌ఐ చాణక్య హెచ్చరించారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని, నిర్వహించే వారితో పాటు ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఏడాది కోడి పందాలు నిర్వహించిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ట్రాక్టర్లతో దున్నటం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు.
ప్రజలు శాంతియుతంగా, ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ, అవనిగడ్డ సీఐ యువకుమార్ నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగ రోజుల్లో పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా ఉంటుందని, ఎక్కడైనా కోడి పందాలు లేదా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి, ఏవైనా అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
