shruti haasan| సోష‌ల్ మీడియా షేక్‌

shruti haasan| సోష‌ల్ మీడియా షేక్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అందాల తార.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌, సెలబ్రిటీ కిడ్ శృతిహాసన్ గురించి పరిచయం అక్క‌ర్లేదు. సింగర్ గా తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలుపెట్టింది. 3 సినిమాతో యువతలో క్రష్ గా మారిన శృతిహాసన్… తెలుగులో తొలిసారి అనగనగా ఓ ధీరుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమా చేసింది. ఈ సినిమా ఆడ‌లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు పవన్ కళ్యాణ్ కు ఇటు శృతిహాసన్ కి మంచి కెరియర్ ని అందించింది. ఆ తర్వాత బలుపు, రామయ్య వస్తావయ్య, ఎవడు , రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు అంటూ వరుస సినిమాలతో దూసుకుపోయింది. కాటమరాయుడు, క్రాక్, వకీల్ సాబ్ , వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ చిత్రాలతో మంచి గుర్తింపును ద‌క్కించుకుంది. ప్రస్తుతం తమిళ్ చిత్రాలతో బిజీగా ఉంది.

Leave a Reply