Short Circuit | భారీ అగ్నిప్రమాదం..

Short Circuit | భారీ అగ్నిప్రమాదం..
Short Circuit | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు రెండో పట్టణం పరిధిలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న చెంగల్ రాయలు నివాసంలో శుక్రవారం కరెంట్ షార్ట్ సర్కట్ కారణంగా పూరి ఇంట్లోకి మంటలు వ్యాపించి ఇల్లు (House) పూర్తిగా దగ్ధం అయ్యింది. అక్కడ నివాసం ఉంటున్న జనాలు లబోదిబోమంటూ విలపించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో సామాను, ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. సాయం కోసం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.
