నియామక పత్రాలు అందజేయనున్న చంద్రబాబు

నియామక పత్రాలు అందజేయనున్న చంద్రబాబు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ (Mega DSC Recruitment) లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన అభ్యర్థులు బుధవారం కర్నూలు నుంచి తరలివెళ్లారు. వీరు ఈనెల 25వ తేదీన అమరావతిలో నిర్వహించే మెగా డీఎస్సీ భారీ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులను రాయలసీమ విద్యాలయం నుంచి బస్సుల్లో తీసుకొని వెళ్లే కార్యక్రమాన్ని జెండాఊపి కలెక్టర్ డా.ఏ.సిరి ప్రారంభించారు. మెగా డీఎస్సీలో భాగంగా రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు (Kurnool) జిల్లా నుంచి ఎంపికైన సంగతి విదితమే.
