Sheikh Nasir | ఛలో హైదరాబాద్ కు తరలిరావాలి

Sheikh Nasir | ఛలో హైదరాబాద్ కు తరలిరావాలి

Sheikh Nasir | రెంజల్, ఆంధ్రప్రభ : ఛలో హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు శనివారం మధ్యాహ్నం తరలిరావాలని ప్రజాపంతా మాస్ లైన్ మండల ప్రధాన కార్యదర్శి షేక్ నసీర్ తెలిపారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమం పూర్తయిన సందర్భంగా ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో కష్టజీవుల, శ్రామికుల, పీడిత ప్రజల కోసం సోషలిజం స్థాపించడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ని ఏర్పర్చి నేటికీ వందేళ్లు పూర్తయింది. వందేళ్ళ కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఎంతో ఉజ్వలమైనది. సదస్సుకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని షేక్ నసీర్ పిలుపునిచ్చారు.

Leave a Reply