శంషాబాద్, మార్చి 1 (ఆంధ్రప్రభ) : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్ పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సిఐ ఎస్ ఎఫ్ డీ జి మొహంక్య తదితరులు పాల్గొనీ రిబ్బన్ కటింగ్ చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ… శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలోని ప్రయాణికుల కోసం నూతనంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ శంషాబాద్ గ్రామంలో ఉండడంతో ఎయిర్ పోర్టు ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి ఇబ్బందిగా మారిందని, జీఎంఆర్ వారి సహకారంతో నూతన అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగిందన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా జనాభా పెరిగిందని వారి కోసం శంషాబాద్ గ్రామంలో ఉన్న ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పనిచేస్తుందని, కేవలం ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టులో అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.