Shad Nagar | విశ్రాంతి ఉద్యోగులను అన్నిరంగాల్లో ఆదుకుంటా

Shad Nagar | విశ్రాంతి ఉద్యోగులను అన్నిరంగాల్లో ఆదుకుంటా
- రంగారెడ్డి జిల్లా విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సరాపు జగదీశ్వర్
Shad Nagar | షాద్ నగర్, ఆంధ్రప్రభ : విశ్రాంతి ఉద్యోగులకు అన్నిరంగాల్లో తన సహాయ సహకారాలు అందిస్తానని ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నుకున్న నూతన విశ్రాంతి ఉద్యోగుల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సరాపు జగదీశ్వర్ అన్నారు. ఇవాళ స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయంలో షాద్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మలిపెద్ది శ్రీనివాసులు గుప్తా ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లాలోని సర్పంచు, ఉపసర్పంచు సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను విశ్రాంతి ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని బెనిఫిట్స్ ను సరైన పద్ధతిలో వచ్చే విధంగా చూస్తానన్నారు.
అదేవిధంగా నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ… మనం రాజకీయంగా ఎదగాలంటే నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకొని పోయినట్లయితే తిరిగి మనకు ప్రజలు అవకాశం ఇస్తారన్నారు. పార్టీలో కచ్చితంగా మన వైశ్యులు నిలబడే స్థానాలను మనందరం కలిసికట్టుగా పనిచేసి మనవాళ్లను గెలిపించాలని సూచించారు. మనవాళ్లలో ఎవరికి సీట్లు కేటాయించినా.. వాళ్లను అందరం కలిసికట్టుగా గెలిపించుకోవాలన్నారు. ఎప్పుడైతే రాజకీయంగా వైశ్యుల శాతం పెరుగుతుందో అప్పుడు.. మనం ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మన ప్రజాప్రతినిధుల ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.
అనంతరం మలిపెద్ది శ్రీనివాస్ అధ్యక్షతన సరాపు జగదీశ్వర్ దండు రాహుల్ ఉప్పల దయానందలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సలహా సంఘం సభ్యులు నాగేళ్ల గోపాల్ గుప్తా, తాడిశెట్టి ప్రకాష్, కక్లూరి పెంటయ్య, సరాపు రమేష్ కుమార్, ఏంసాని శ్రీనివాసులు, పెద్ది రామ్మోహన్, ఎల్కుర్తి నారాయణ, కల్వ యాదగిరి, తాటి రామచంద్రుడు, కల్వ మాణిక్యం గుబ్బ సురేష్ గుబ్బ శ్రీనివాసులు పెనుగొండ అశోక్ పెండ్యాల జగదీశ్వర్ వాడకట్టు విజయకుమార్ గుడిపల్లి వెంకటరమణ బాల రాజేష్ దండు రామ్మోహన్ నవీన్ గార్లపాటి, తదితరులు పాల్గొన్నారు.
