Sangareddy | గిరిజన మహిళపై లైంగిక దాడి
సంగారెడ్డి, ఫిబ్రవరి 17 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో గిరిజన మహిళపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన దంపతులు ఈనెల 14వ తేదీన సంత్ సేవాలాల్ గుడికి కాలినడకన అనంతపురం జిల్లా నేరేడు గొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బస చేశారు.
ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపారు.