రూ. 2లక్షలతో మురికి కాల్వ నిర్మాణ పనులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం పంచాయతీలో గల ఆరవ వార్డులో 2 లక్షలతో నూతనంగా నిర్మించే మురికి కాలువ నిర్మాణ పనులకు శుక్రవారం ఆరవ వార్డు సభ్యులు కొమ్ము భీమన్న పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్కారం గ్రామపంచాయతీ నిధులతో అయుముఖాన్ని ఇంటి నుండి అంజద్ ఖాన్ ఇంటిపక్కల నుండి కల్వర్టు వరకు మురికి కాలువ నిర్మించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మసూద్ అలీ, వార్డు మెంబర్ కోలా సత్యన్న, యువ నాయకులు అంజద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply