Science | సైన్సే మానవ ప్రగతికి మూలం…

Science | సైన్సే మానవ ప్రగతికి మూలం…
Science | అచ్చంపేట, ఆంధ్రప్రభః ప్రస్తుత సమాజంలో మానవ మనుగడకు, ప్రగతికి సైన్సే మూలమని, సైన్స్ లేనిది జీవితం లేదని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ కార్యదర్శి ఆశా మిశ్రా అన్నారు. అచ్చంపేట పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఐదవ వార్షిక సమావేశాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శాస్త్రీయ ఆలోచన విధానం పెరిగితేనే సాంకేతిక అభివృద్ధి మానవ ప్రయోజనాలకు దోహదపడుతుందన్నారు. కార్పొరేట్ శక్తులు మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ సాంకేతికతను దోపిడీకి వినియోగిస్తున్నాయని విమర్శించారు.
పర్యావరణాన్ని దెబ్బతీసే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్, జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… మేధావుల జ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయమన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ప్రతినిధులు బి.ఎన్.రెడ్డి, రామచంద్రయ్య, వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, బలరాం, గోపాల్, దశరథం, బాబురావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

