School | విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం

School | విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం
ఎమ్మెల్యే గొండు శంకర్
School | శ్రీకాకుళం, (ఆంధ్రప్రభభ) : ప్రభుత్వ పాఠశాలలకు (School) వచ్చే విద్యార్థుల ఉదయపు ఆకలిని తీర్చేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ చేపట్టిన ‘ఉదయం పోషకాహార కార్యక్రమం’ అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కొనియాడారు..సోమవారం కిష్టప్ప పేట జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చాలామంది పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాలకు వస్తున్నారని, వారి కోసం అక్షయ పాత్ర పౌష్టికాహారాన్ని అందించడం శుభపరిణామమని అన్నారు.
అనంతరం స్వయంగా విద్యార్థులకు (Students) పోషకాహారాన్ని (చిరుధాన్యాలతో చేసిన చిక్కీలు, వేరుశెనగలు, ప్రోటీన్ బార్) పంపిణీ చేశారు. శ్రీకాకుళం, గార మండలాల్లోని దాదాపు 14,000 మంది విద్యార్థులకు దీనివల్ల మేలు జరుగుతుంది. వారంలో 3 రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) స్కూల్ అసెంబ్లీ తర్వాత ఈ ఆహారాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ఎం.ఈ.ఓలు నక్క రామకృష్ణ, మురళి కృష్ణ, హెచ్.ఎం సాయి సంధ్య, సర్పంచ్ సత్యవతి, అక్షయపాత్ర రీజినల్ మేనేజర్ రామ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

