మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలు

మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలు

పరిశీలించిన ఎమ్మెల్యే

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని జిల్లా పరిషత్ హైస్కూలును ఎమ్మెల్యే సందర్శించారు. హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధం చేసిన పులిహోర, చెట్నీ, ఉడికించిన కోడిగుడ్డు పరిశీలించారు. మెనూ అమలు, నాణ్యత పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటోంది? అని ఎమ్మెల్యే విద్యార్థులను ప్రశ్నించగా వారు బాగుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరతాన్నధాత్రిగా ఖ్యాతి పొందిన డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారం, రుచికరమైన పదార్ధాలతో వడ్డిస్తున్నట్లు తెలిపారు.

మెనూ ఖచ్చితంగా అమలు చేయటం ద్వారా విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, ఎంఈఓ అన్నపరెడ్డి పిచ్చియ్య, హెచ్ఎం మత్తి నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply