శివ‌ధ‌ర్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ కొత్త డీజీపీ (Telangana New DGP) గా శివధర్ రెడ్డి ఈ రోజు ఉద‌యం బాధ్యతలు చేపట్టారు. ఈ సంద‌ర్భంగా లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయ‌న‌కు పండితుల ఆశీర్వాదం అంద‌జేశారు.

1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి (Shivadhar Reddy) తెలంగాణ 6వ డీజీపీగా నియమితులయ్యారు. తొలుత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాడర్ కు పనిచేసిన ఆయన.. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు రీ అసైన్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996-2000 సంవత్సరాల్లో విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా పనిచేశారు.

ఆ తర్వాత గ్రే హౌండ్స్ లో అడిషినల్ ఎస్పీగా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బెల్లంపల్లిలో విధులు నిర్వహించారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రీమిజంని అణచివేయడంతో, ఉగ్రవాద కదలికల్ని చేధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

Leave a Reply