వధూవరులకు సర్పంచ్ కానుక

చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్ కుమార్తె వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా చిట్యాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం రూ.10,116 నగదును కానుకగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కానుకను అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కోరి యాదయ్య, ఏర్పుల నరసింహ, ఏదుల రామ్ రెడ్డి, పొట్లపల్లి విష్ణు, గాజుల నరసింహ, పొట్లపల్లి కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.
