ఘనంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

ఘనంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

  • పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్, సన్మానం
  • సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్

చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆదివారం చిన్నకపర్తి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల సంక్షేమం మరియు గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.
​కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక:
​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు. “మేము కోరుకున్న ఆదర్శ గ్రామ పంచాయతీ దిశగా అడుగులు వేస్తున్నాము, ఇందులో కార్మికులది కీలక పాత్ర” అని ఆయన పేర్కొన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి, వారిని ఘనంగా సన్మానించారు. వారికి నిత్యావసర వస్తువులైన సబ్బులు, కొబ్బరి నూనె, షాంపులను పంపిణీ చేశారు.
​మన ఊరు – మన పరిశుభ్రత:
​గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి వీధి అద్దంలా మెరవాలని సర్పంచ్ ఆకాంక్షించారు. “వీధుల్లో ఎక్కడా చెత్తాచెదారం ఉండకూడదు. పరిశుభ్రత అనేది కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామస్థుడి బాధ్యత. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు సభ్యులు పాకాల నర్సింహా, ఇరమళ్ళ దయాకర్, రొండి నర్సింహా, పెర్కా నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నందిపాటి మహేష్, ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply