Sarpanch | ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..

Sarpanch | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్కపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని బీజేపీ బలపరిచిన మల్లక్కపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిక్క స్వరూప కోరారు. సోమవారం రోజు గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సర్పంచిగా పోటీ చేస్తున్నాను అన్నారు. తమను గెలిపిస్తే.. ఆదర్శ గ్రామంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యువత మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తమపై నమ్మకంతో గ్రామ సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎలాంటి సమస్యలున్నా.. తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అభ్యర్థి స్వరూప తెలియచేశారు.
