ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ ; బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కడెం మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా గురువారం కడెం మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని గౌడ కులస్తులు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను కొనియాడారు. దోపిడి దారుల అరాచకాలను ఎదిరించి బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నాయకులు కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘం నాయకులు, కులస్తులు ఏ.రవీందర్ గౌడ్, బి శేఖర్ గౌడ్, రాజగౌడ్, బి దశగౌడ్, ఎం శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply