Sankranti | ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు..

Sankranti | ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు..

Sankranti, మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం అడవిసోమనపల్లి గ్రామంలో సంక్రాంతి పర్వదినాన వివేకానంద యూత్, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముత్యాల ముగ్గులు కళలలకు నిలయాలని, ముగ్గులు మహిళల్లో ఉండే ప్రతిభను వెలికి తీస్తాయన్నారు.

సంక్రాంతి పండుగ రోజున మహిళందరూ కలిసి ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే పోటీలలో గెలుపోటములు సహజమని ఎవరు బాధ పడద్దన్నారు. అనంతరం ముగ్గుల్లో గెలుపొందిన మహిళలకు యూత్ సభ్యులతో కలిసి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply