Samyuktha Menon | అదే ఫైనల్ గోల్..

Samyuktha Menon | అదే ఫైనల్ గోల్..

Samyuktha Menon, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నట సింహ నందమూరి బాలకృష్ణ, (Balakrishna) ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ, క్రేజీ మూవీ అఖండ 2. ఈ మూవీలో సంయుక్త మీనన్ నటించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 5, ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా అఖండ 2 విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ అఖండ 2 చిత్ర విశేషాలను తెలియచేశారు.

Samyuktha Menon | ఇమాజినేషన్ కి మించి ఈ సినిమా

డైరెక్టర్ బోయపాటి (Boyapati) ఈ కథ గురించి చెప్పినప్పుడు ముందు డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగానని.. లేవని చెప్పారని.. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పడంతో.. అప్పుడు వాళ్ళు డేట్స్ అడ్జస్ట్ చేశారు. ఆ విధంగా ఈ సినిమాలో నటించడం జరిగిందని సంయుక్త మీనన్ తెలియచేసింది. చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఇమాజినేషన్ కి మించి ఈ సినిమా ఉంటుంది అన్నారు.

Samyuktha Menon

ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో చాలా కీలకంగా ఉంటుంది.. అలాగే స్టయిలీష్ గా వుంటుందని సంయుక్త చెప్పారు. సినిమాలో సాంగ్ చేయాలని చెప్పినప్పుడు.. ఆ పాట విన్న తర్వాత చాలా నెర్వస్ గా అనిపించిందట. అంత మాస్ సాంగ్ నేనెప్పుడూ చేయలేదు. తప్పకుండా సాంగ్ ని అద్భుతంగా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.. రెండు రోజులు ప్రాక్టీస్ తర్వాత మోకాలు సహకరించలేదట. తర్వాత ఫిజియోథెరపీ తీసుకుందట. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన తర్వాత వాళ్లని ఎంటర్టైన్ చేయాలి. అదే ఫైనల్ గోల్. ఖచ్చితంగా అఖండ 2 (Akhanda 2) అందరికీ నచ్చుతుందని సంయుక్త మీనన్ చెప్పారు.

బాలయ్యతో నటించడం గురించి సంయుక్త చెబుతూ… బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో చూడండి అన్నారు.

Samyuktha Menon

click here to read ఆమిర్ ఖాన్ తో అనుకుంటే.. ?

click here to read more

Leave a Reply