ఇరుకైన రోడ్లతో వాహనదారులకు ఇబ్బందులు….

ఇరుకైన రోడ్లతో వాహనదారులకు ఇబ్బందులు….

తృటిలో తప్పిన ప్రమాదం….

గట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల మండల కేంద్రంలో ఈరోజు ఆర్టీసీ బస్సుకు, టిప్పర్ కు తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా గట్టుప్పల మండల కేంద్రంలో రోడ్లు లేకపోవడంతో ప్రధాన రహదారులు ఇరుకుగా ఉండటం దాంతోపాటు గుంతలమయంగా రోడ్లు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోజురోజుకు వాహనాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రోడ్ల వెడల్పు సరిపోక ముఖ్యంగా రోడ్డుపై ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వాహనాలను తప్పించడం కష్టంగా మారుతుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఒకేసారి చేరుకోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply