RTC | సమ్మె నోటీసు

RTC | సమ్మె నోటీసు
విలీన ప్రక్రియ చేపట్టాలి
RTC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలన్నారు. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని, అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
