Rs, 25 thousand | పంట నష్టపరిహారం ఇప్పిస్తారు..!

Rs, 25 thousand | పంట నష్టపరిహారం ఇప్పిస్తారు..!

Rs, 25 thousand | నర్సంపేట, ఆంధ్రప్రభ : మొoథా తుఫాన్(Mootha Typhoon) వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఎప్పుడిస్తారని బీఆర్ ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సంపేట రూరల్ కమిటీ ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పత్తి పంటలను ఈ రోజు పరిశీలించారు.

ఈ సందర్భంగా మండల ఇంచార్జీ నామాల సత్యనారాయణ(Namala Satyanarayana) మాట్లాడుతూ ముంథా తూఫాన్ వల్ల నష్ట పోయిన పత్తి, మొక్కజొన్న,వరి ఇతర పంటలకు అన్నింటికీ ఎకరాకు రూ,25 వేలు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ తూఫాన్ వచ్చిన వెంటనే నష్ట పరిహారం అందించారనీ తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన బాకి ఉన్న బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూఫాన్ వల్ల మండలం లోనీ అన్నీ గ్రామాల్లో వరి,మొక్క జొన్న,పత్తి తదితర పంటలు విపరీతంగా నష్ట పోయాయని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి ఎకరాకు రూ,25 వేలు(Rs, 25 thousand నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ,10 వెలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడ నష్ట పరిహారం ఇవ్వలేద న్నారు. అధికారులు తూఫాన్ వల్ల నష్ట పోయిన అన్నీ పంటలను పరిశీలించి నష్ట పరిహారం అందించాల ని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసిందని, రైతులకు బాకీ ఉన్న బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి లు ఈర్ల నర్సింహారములు, మోతే జై పాల్ రెడ్డి, మోటురీ రవి, కోడారీ రవి, బండారి రమేష్, గొడిశాల రాంబాబు, అల్లి రవి, పత్కాల కొమ్మలు, పత్రీ కుమారస్వామి, బుస శ్రీశైలం, సోమర్తి రాజు, రాజులపాటి ఐలయ్య రైతులు పాల్గొన్నారు.

Leave a Reply