Rs. 18,500 | రాజకీయ వేధింపులు ఆపాలి..

Rs. 18,500 | రాజకీయ వేధింపులు ఆపాలి..

Rs. 18,500 | కళ్యాణదుర్గం టౌన్, ఆంధ్రప్రభ : శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల పై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీ హెచ్ రాయుడు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు పట్టణంలో చేపట్టిన రిలే దీక్షలకు బీ హెచ్ రాయుడు(B H Rayudu) ఈ రోజు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల పట్ల రాజకీయ వేధింపులకు పాల్పడడం, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతంలో కార్మికుల చేత ఖాళీ బాండ్ల పై బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, కొందరు కార్మికులను విధుల నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు.

కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ అడపాల వెంకట్రావును తక్షణమే అరెస్ట్ చేసి, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనాన్ని రూ. 18,500 నుంచి రూ. 11 వేలకు(Rs. 18,500 to Rs. 11 thousand) తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

కాంట్రాక్టర్(contractor) కు నియమించిన సూపర్ వేజర్స్ కిరణ్, గౌతమ్ కార్మికుల పై చేస్తున్న అజమాయిషీ, రాజకీయ వేధింపులు, తొలగింపులను వెంటనే ఆపాలని, కాంట్రాక్టర్ అడపాల వెంకట్రావుతో పాటు కిరణ్, గౌతమ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏ పి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బీ హెచ్ రాయుడు హెచ్చరించారు.

Leave a Reply