Rs. 1035 crore | సేవ చేసే భాగ్యం దేవుడిచ్చిన గొప్పవరం

Rs. 1035 crore | సేవ చేసే భాగ్యం దేవుడిచ్చిన గొప్పవరం
- నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయండి.
- గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకం.
- నూతన సర్పంచ్ లు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి.
- రాష్ట్ర పశుసంవర్ధక పాడి మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
Rs. 1035 crore | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి ప్రజలు ఓట్ల ద్వారా ఎంతో నమ్మకంతో గెలిపించారని వారికి సేవ చేయడం గొప్ప వరంగా నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర పాడి పశుసంవర్ధక క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) అన్నారు.
ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో నూతనంగా గెలుపొందిన ముదిరాజ్ సర్పంచ్ లు, ఉప సర్పంచులు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకమని నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు.
కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో జరిగే అభివృద్ధిలో సర్పంచులకు గురుతర భాద్యత ఉంటుందన్నారు. గెలుపొందిన ప్రజా ప్రతినిధులు(public representatives) గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మీ గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఊరి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరూ అధైర్య పడవద్దని, రాబోవు రోజుల్లో ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని భరోసానిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. రెండేళ్లలో మక్తల్ నియోజకవర్గంలో రూ.1035 కోట్లతో(Rs. 1035 crore) అభివృద్ధి పనులు చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు కథలప్ప, వాకిటి వెంకటేష్, తిరుమలేష్, వాని కస్తూరి వెంకట్రాములు, ఎల్లమ్మ తిమ్మప్ప, విజయలక్ష్మి నరసింహ, రాములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
